అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుంది మరి!
- 'మిరాయ్'తో మెప్పించిన రితికా
- బలమైన కథ కోసమే తీసుకున్న గ్యాప్
- 'కొరియన్ కనకరాజు'తో భారీ హిట్
- మరిన్ని అవకాశాలతో దూసుకుపోయే ఛాన్స్
ఒకప్పుడు మీనా .. రంభ .. నగ్మా వంటి బొద్దుగా ఉన్న బ్యూటీలు తెలుగు తెరను ఒక ఊపు ఊపేశారు. స్టార్ హీరోలతో కలిసి వరుస విజయాలను అందుకుంటూ, తమ కెరియర్ ను పరుగులు తీయించారు. అలా కాస్త బొద్దుగా కనిపిస్తూ .. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ మధ్య కాలంలో యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీగా రితికా నాయక్ కనిపిస్తుంది. 'మిరాయ్' సినిమాలో ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు, థియేటర్స్ దగ్గరే మనసులు పోగొట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మ నెలకో సినిమా చేస్తే బాగుండునే అనుకున్నారు.
కానీ 'మిరాయ్' మాదిరిగానే తనకి బాగా నచ్చే కంటెంట్ కోసం రితికా ఎదురుచూస్తూ వచ్చిందనే విషయం, 'కొరియన్ కనకరాజు' రిలీజ్ తరువాతనే అర్థమవుతోంది. రీసెంటుగా విడుదలైన ఈ సినిమా, అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకుంది. కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఫలితం ఊరటను ఇచ్చింది .. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోను నటన పరంగా .. గ్లామర్ పరంగా రితికా మంచి మార్కులు కొట్టేసింది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అనిపించింది.
కొంత కాలంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ వైపు నుంచి సందడి తగ్గిందనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాలు చేసుకుపోతున్నారే తప్ప, నిలకడగా ఎవరూ సక్సెస్ లు సాధించలేకపోతున్నారు. టాప్ త్రీ .. టాప్ 5 అంటూ గతంలో మాదిరిగా ఒక జాబితా చూసుకుంటే, ఎవరూ కనిపించని ఒక గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో భారీ హిట్ ను అందుకున్న రితికా, మరిన్ని అవకాశాలతో బిజీ అవుతుందేమో చూడాలి.