భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రాత్మక ఘట్టం: ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానం!
- అల్లూరి సీతారామరాజు' విమానాశ్రయంలో వాణిజ్య సర్వీసులు ప్రారంభం
- ఉదయం 6:45 గంటలకు ల్యాండ్ అయిన తొలి ఇండిగో విమానం
- ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలతో ఘన స్వాగతం పలికిన అధికారులు
- విశాఖ పాత ఎయిర్‌పోర్ట్ నుంచి పౌర విమాన సేవలు పూర్తిగా బదిలీ
- ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అంచనా
ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి.
నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, అందులోని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్, పౌర విమానయాన శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తొలి ప్రయాణానికి గుర్తుగా ప్రయాణికులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు, స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. దీని తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయింది.
భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖపట్నంలోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే పౌర విమాన సర్వీసులన్నింటినీ ఇక్కడికే మార్చారు. తొలిరోజే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. నేడు మొత్తం 31 సర్వీసులు నడవనుండగా, దాదాపు 7 వేల మంది రాకపోకలు సాగించనున్నారు. ఇక విశాఖ నుంచి గత రాత్రి (ఆదివారం) 10.45 గంటలకు చివరి విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత వాణిజ్య సేవలు నిలిచిపోయాయి.
ఈ అత్యాధునిక విమానాశ్రయం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు వేగంగా విస్తరించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి.