రామాయణంలో సీతగా సాయి పల్లవి.. బుల్లితెర సీత దీపిక చిఖాలియా స్పందన
- నితేశ్ తివారీ రామాయణంలో సీత పాత్ర పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి
- సాయి పల్లవి అద్భుతమైన నటి అన్న దీపిక చిఖలియా
- రణబీర్ కపూర్ కూడా అద్భుత నటుడు అని కితాబు
నితేశ్ తివారీ రామాయణం చిత్రంలో టాలీవుడ్ నటి సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామానంద్ సాగర్ బుల్లితెర రామాయణంలో సీత పాత్రలో అమరిన దీపిక చిఖాలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“రణబీర్ కపూర్, సాయి పల్లవి ఇద్దరూ చాలా మంచి నటులు. సాయి పల్లవి పని చూశాను. ఆమె అద్భుతమైన నటి. రణబీర్ కూడా అద్భుత నటుడు. ఇద్దరూ తమ పాత్రలను అందంగా చూపిస్తారని నాకు నమ్మకం ఉంది” అని దీపిక చిఖలియా అన్నారు.
దీపిక చిఖాలియా 1987లో రామానంద్ సాగర్ టీవీ 'రామాయణం'లో సీత పాత్రలో నటించి భారతీయుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రామాయణం పార్ట్-1 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. దీపిక చిఖలియా వ్యాఖ్యలు సాయి పల్లవి అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.