అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి
- స్నేహితులతో కలిసి దాడి చేసిన కొమురక్క అసిస్టెంట్
- కర్రలు, రాళ్లతో కొట్టి చంపేందుకు యత్నం
- గ్రామస్థులు రావడంతో పరారైన దుండగులు
ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్ తన స్నేహితులు 8 మందితో బైక్‌లపై కొమురక్క ఇంటికి వచ్చారు. తాము అభిమానులమని, ఫొటోలు దిగాలని కోరడంతో ఆయన వారిని లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్లగానే, ‘‘మా శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావు?’’ అంటూ వాగ్వాదానికి దిగి దాడి చేశారు. నిందితుల్లో ఒకరు రాయితో దాడి చేయబోగా కొమురక్క సోదరుడు యాదయ్య అడ్డుకున్నారు. దీంతో దుండగులు యాదయ్యతో పాటు అడ్డువచ్చిన స్థానికుడిపైనా దాడికి దిగారు. కర్రతో కొట్టడంతో కొమురక్క కుడి చేతికి తీవ్ర గాయమైంది.
గ్రామస్థులు గుమికూడటంతో నిందితులు తమ బైక్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు బాలానగర్ ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన 8 మందిని బుధవారం అరెస్టు చేశారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.