ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట విచారణకు హాజరైన సంతోష్ రావు
- మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరైన సంతోష్ రావు
- జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న అధికారులు
- ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావును విచారించిన పోలీసులు
సంతోష్ రావుకు నిన్న సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మూడు గంటలకు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావులను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు.