ఆయుధాలు వీడండి: మావోయిస్టులకు అమిత్ షా పిలుపు
- బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్న అమిత్ షా
- 2026 మార్చి నాటికి నక్సల్స్ సమస్య అంతమవుతుందన్న అమిత్ షా
- ఆయుధాలు పట్టుకొని గిరిజనుల అభివృద్ధిని ఆపలేరన్న కేంద్ర మంత్రి
బస్తర్లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయని ఆయన అన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు మనలో భాగమేనని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం ఉండదని అన్నారు. ఆయుధాలను చేతబూని స్థానికుల, గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు.