సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. బాంద్రా చెరువులో చాకు మూడో భాగం గుర్తింపు
- 2.5 అంగుళాల పొడవున్న చాకుతో సైఫ్‌పై దాడి
- దాడి తర్వాత సైఫ్ శరీరంలో మొదటి భాగం
- ఆపరేషన్ చేసి వెలికి తీసిన వైద్యులు
- బాంద్రా లేక్‌లో విసిరేసిన మూడో భాగం తాజాగా స్వాధీనం
- దాడి తర్వాత వర్లి కొలివాడలో క్షవరం చేయించుకున్న నిందితుడు
నిందితుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్‌ను ఈ నెల 16న అరెస్ట్ చేశారు. నటుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన చాకును అతడు బాంద్రా చెరువులో విసిరేసి ఉంటాడని అనుమానించిన పోలీసులు నిన్న సాయంత్రం అతడిని అక్కడికి తీసుకెళ్లారు. చెరువులో గాలించి విసిరేసిన ఆ మూడో భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, సైఫ్‌పై దాడిచేసిన ఏడు గంటల తర్వాత నిందితుడు వోర్లి కొలివాడలోని ఓ హెయిర్ కంటింగ్ సెలూన్‌కు వెళ్లి క్షవరం చేయించుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.