ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కల్యాణ్ రామ్
- ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవర
- టికెట్ల ధర, షోల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
- రిలీజ్ రోజున ఆరు షోలకు అనుమతించిన ఏపీ సర్కార్
ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ను అందించింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110లు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 9 రోజుల పాటు రోజుకు అయిదు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిలీజ్ రోజున ఆరు షోలకు అనుమతించింది.