ఐశ్వర్య రాయ్‌తో విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్
- ఉంగరాన్ని చూపించి మరీ.. కలిసే ఉన్నామని స్పష్టం చేసిన అభిషేక్ బచ్చన్
- ఈ విషయం గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదని వ్యాఖ్య
- కథనాల కోసమే రాశారని అభిషేక్ అసహనం
- సెలబ్రిటీలం కాబట్టి భరిస్తామని వ్యాఖ్య
కాగా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ బచ్చన్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షీకార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి ఇద్దరూ వేర్వేరు హాజరయ్యాక ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘గ్రే డైవర్స్’కు (50 ఏళ్లు పైబడినవారు విడాకులు తీసుకోవడం) సంబంధించిన పోస్టుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టడంతో విడాకుల అనుమానాన్ని మరింత బలపరిచింది.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 2011లో వారికి ఆరాధ్య పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఫొటోలను ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాగా వివాహానికి ముందు గురు, ధాయ్ అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్-2, ఉమ్రావ్ జాన్ సినిమాలలో ఇద్దరూ జంటగా నటించారు.