మూడు రాజధానులే మా విధానం.. బొత్స నోట అదే మాట!
- మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్న వైసీపీ నేత బొత్స
- ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ
- విజయనగరంలో వైసీపీ కార్యాలయాన్ని అదితి గజపతిరాజు సందర్శించడాన్ని తప్పుబట్టిన నేత
తాజా ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చీ రాగానే అమరావతిలో పడకేసిన పనులను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ మళ్లీ జోరుగా పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో తమ వైఖరి ఏంటో వైసీపీ మరోమారు స్పష్టం చేసింది. నిన్న విజయనగరంలో విలేకరులతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. అదే తమ పార్టీ విధానమని పేర్కొన్నారు. కాగా, ఇటీవల విజయనగరంలో వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పరిశీలించడాన్ని బొత్స తప్పుబట్టారు.