పుష్ప-2 కొత్త రిలీజ్ డేట్ ఇదే
- అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2
- డిసెంబరు 6న రిలీజ్ కానున్న పుష్ప-2
- రిలీజ్ డేట్ పోస్టర్ పంచుకున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు, టీజర్లకు విశేషమైన స్పందన లభించింది.
వాస్తవానికి పుష్ప-2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే, అదే రోజున రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ అవుతోంది. దాంతో పాటే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందువల్లే పుష్ప-2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తోంది.