శోభన్ బాబుగారు తాను చాలా ఫీల్ అవుతున్నట్టు చెప్పేవారు: జయసుధ
- దాసరిగారు చాలా సీరియస్ గా ఉండేవారని వెల్లడి
- కృష్ణగారు తక్కువగా మాట్లాడేవారని వ్యాఖ్య
- శోభన్ బాబు సరదాగా ఉండేవారని వివరణ
ఇక దాసరిగారి విషయానికి వస్తే .. సెట్లో ఇతర విషయాలను గురించి ఆయన మాట్లాడనీయరు .. జోకులు వేయనీయరు. చాలా సీరియస్ గా తన పనిచేసుకు వెళుతూ ఉండేవారు. అప్పట్లో కృష్ణగారు .. శోభన్ బాబు ఇద్దరూ చాలా హ్యాండ్సమ్. కృష్ణగారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ శోభన్ బాబుగారు అందరితో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు" అని చెప్పారు.
"అప్పటి హీరోయిన్స్ లో చాలామంది తమ పర్సనల్ విషయాలను కూడా శోభన్ బాబుగారితో చెప్పుకునేవారు. బోయ్ ఫ్రెండ్స్ గురించిన విషయాలను కూడా ఆయన దగ్గర మాట్లాడేవారు. "మీ హీరోను నేను కదా .. మీరంతా నా దగ్గరే మీ బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటే నేనెంత ఫీలవుతున్నానో తెలుసా? అని నవ్వేవారు" అంటూ జయసుధ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు.