హైకమాండ్ తో నేను మాత్రమే ఎందుకు ఘర్షణ పడాలి?: బాలినేని శ్రీనివాసరెడ్డి
- మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని
- జిల్లాలోని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారని విమర్శ
- ఎంపీగా ఎవరిని ప్రకటించినా అభ్యంతరం లేదని వ్యాఖ్య
ఎంపీగా ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితేనే బాగుంటుందనేది తన భావన అని బాలినేని చెప్పారు. మాగుంట ఎంపీ అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు లాభమనే ఉద్దేశంతోనే తాను పట్టుబట్టానని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని తెలిపారు.