రేవంత్ రెడ్డితో స్నేహంపై కోమటిరెడ్డి పాట.... వీడియో ఇదిగో!
- గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య విభేదాలు!
- ఎన్నికల వేళ చిగురించిన పాత స్నేహం
- కలిసి కదం తొక్కిన కాంగ్రెస్ అగ్రనేతలు
- రేవంత్ ముఖ్యమంత్రి... కోమటిరెడ్డి మంత్రి అయిన వైనం
ఇప్పుడు కోమటిరెడ్డి... రేవంత్ పట్ల స్నేహగీతం ఆలపిస్తున్నారు. రేవంత్ తో తన దోస్తీపై ఆయన నిజంగానే ఓ పాట విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. తామిద్దరి మధ్య ఉన్న స్నేహానుబంధాన్ని కోమటిరెడ్డి కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు.
గతము మరువని గమనమే
ఒకరు గర్జన... ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకరు... సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే...
ఒకడు చిచ్చురా... ఒకడు తెమ్మెర
కలిసి దహనాలే...
స్నేహమే ఇదిలే... నూరేళ్లు నిలవాలే