స్కిల్ కేసు విషయంలో ఉండవల్లి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా!
- సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్
- కేసులో కొందరికి నోటీసులు అందలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాదులు
- తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసిన హైకోర్టు
ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ కేసులో కొందరికి మాత్రమే నోటీసులు అందాయని... మరికొందరికి అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని, మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి వారికి చేరలేదని కోర్టుకు రిజిస్ట్రార్ తెలిపారు. వీరికి పర్సనల్ గా నోటీసులు ఇచ్చేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది.