సల్మాన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: 'గాడ్ ఫాదర్' డైరెక్టర్
- 'గాడ్ ఫాదర్' గా వచ్చిన చిరంజీవి
- ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన సల్మాన్
- చిరూ పక్కన కనిపిస్తే చాలన్న సల్మాన్
- కథ వినకుండా చేయడం గొప్ప విషయమన్న మోహన్ రాజా
'ధ్రువ' సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి నేను చరణ్ ను కలుస్తూ ఉండేవాడిని. ముందుగా తనతో 'లూసిఫర్' రీమేక్ చేయమని చిరంజీవిగారు అనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కావాలని చిరంజీవి గారిని అడిగినప్పుడు, ఆయన సల్మాన్ గురించి ప్రస్తావించారు.
'లూసిఫర్' మూవీని ఒకసారి చూడమని సల్మాన్ ఖాన్ కి చెప్పినా ఆయన చూడలేదు. చిరంజీవిగారి పక్కన కనిపిస్తే చాలు అని అనడం ఆయన గొప్పతనం. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నాకు చిరంజీవిగారు చెప్పారు. వాళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చారు.