'సీతారామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్
- దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా సీతారామం
- హను రాఘవపూడి దర్శకత్వంలో చిత్రం
- రేపు హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక
- ప్రభాస్ వస్తున్నాడంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడి
ఈ మేరకు 'సీతారామం' చిత్ర నిర్మాణ సంస్థ స్వప్న సినిమా వెల్లడించింది. 'మన డార్లింగ్ వస్తున్నాడు' అంటూ ప్రకటించింది. కాగా, 'సీతారామం' చిత్రంలో సుమంత్, రష్మిక మందన కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది.