మాస్టర్స్‌ను డిస్టింక్షన్లో పూర్తి చేసిన చెవిరెడ్డి కుమారుడు.. ఉప్పొంగిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
- లండన్‌లోని వార్విక్లో చదువు పూర్తి చేసిన మోహిత్ రెడ్డి
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన వైనం
- స్నాతకోత్సవానికి హాజరైన చెవిరెడ్డి దంపతులు
లండన్‌లోని వార్విక్ యూనివర్సిటీలో మోహిత్ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశారు. 'మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్'లో మాస్టర్ డిగ్రీని ఆయన అందుకున్నారు. అది కూడా డిస్టింక్షన్లో ఈ పట్టాను ఆయన అందుకున్నారు. బుధవారం వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పట్టా అందుకోగా... ఈ వేడుకకు చెవిరెడ్డి దంపతులు హాజరయ్యారు.