మళ్లీ తెరపైకి 'పెళ్లి సందD' జోడీ!
- యూత్ ను ఆకట్టుకున్న 'పెళ్లి సందD'
- గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన శ్రీలీల
- వరుస ఆఫర్లతో బిజీ బిజీ
- వైజయంతి మూవీస్ కి గ్రీన్ సిగ్నల్
- కొత్త దర్శకుడితో 20 కోట్ల ప్రాజెక్ట్
ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, అమ్మడి అందాలకు మంచి మార్కులు పడిపోయాయి. దాంతో సహజంగానే వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఎంతమాత్రం గ్యాప్ లేకుండా ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతుండటం విశేషం. ఆ జాబితాలో రవితేజ .. వైష్ణవ్ తేజ్ .. మహేశ్ .. ప్రభాస్ సినిమాలు ఉండటం మరో విశేషం.
తాజాగా ఈ బ్యూటీ రోషన్ జోడీగా మరోసారి కనువిందు చేయనున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వైజయంతి మూవీస్ వారు ఒక ప్రాజెక్టును సెట్ చేస్తున్నారట. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.