రజనీకాంత్ తీవ్ర మనోవేదనలో ఉన్నారంటూ కథనాలు!
- విడిపోయిన కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్
- విడిపోతున్నట్టు జనవరి 17న ప్రకటించిన జంట
- గతంలో ఎప్పుడు వివాదం వచ్చినా పరిష్కరించిన రజనీ
తన కూతురు, అల్లుడిని కలిపేందుకు రజనీ ఎంతో ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన ఎడబాటు తాత్కాలికమేనని రజనీ బలంగా నమ్ముతున్నారట. వాస్తవానికి ఐశ్వర్య-ధనుష్ మధ్య గతంలో కూడా విభేదాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ వివాదాలను పరిష్కరించి, ఇద్దరినీ కలిపేవారట. కానీ ఈసారి ఇద్దరూ విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో రజనీ ఎంతో ఆవేదనకు గురవుతున్నారట.