రేపు 'భీమ్లా నాయక్' నుంచి ఫుల్ సాంగ్ రిలీజ్!
- ముగింపు దశలో 'భీమ్లా నాయక్'
- ఆవేశపరులైన పాత్రల్లో పవన్ - రానా
- కథానాయికలుగా నిత్యామీనన్ - సంయుక్త మీనన్
- కీలకమైన పాత్రలో సముద్రఖని
పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం రానా - సంయుక్త మీనన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'లాలా భీమ్లా .. ' అనే సాంగ్ టీజర్ ను వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముందుగా చెప్పినట్టుగానే రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. లుంగీ మీద తొడకొడుతూ మీసం మెలేసే పాత్రలో పవన్ కనిపిస్తుండటంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.