ఎన్టీఆర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మి?
- తమిళ, తెలుగు సినిమాలలో వరలక్ష్మి బిజీ
- 'క్రాక్', 'నాంది' సినిమాలతో మరింత పేరు
- ఎన్టీఆర్ సినిమాలో పొలిటీషియన్ పాత్ర
ఈ క్రమంలో వరలక్ష్మికి టాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలకు దీటుగా వుండే పాత్రలను కూడా ఆమెకు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ రూపొందించే చిత్రంలో ఆమెకు కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ సినిమా నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రను ఆమెకు ఆఫర్ చేసినట్టు సమాచారం.