నితిన్ 30వ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు
- దుబాయ్ లో నితిన్ 30వ సినిమా షూటింగ్
- జూన్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటన
- ఈ నెల 26న వస్తున్న మరో చిత్రం 'చెక్'
- మార్చ్ 26న విడుదల కానున్న 'రంగ్ దే'
ఇదిలావుంచితే, తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను చిత్ర నిర్మాతలు ఈ రోజు విడుదల చేశారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రాన్ని జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ రిలీజ్ పోస్టర్లో నితిన్ పియానో ప్లే చేస్తున్నట్టు షేడ్ లో కనిపిస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి కలసి నిర్మిస్తున్నారు.
మరోపక్క, నితిన్ ఇప్పటికే మరో రెండు చిత్రాలలో నటించాడు. వీటిలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన 'చెక్' విడుదలకు సిద్ధమైంది. దీనిని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన 'రంగ్ దే' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో వుంది. దీనిని మార్చ్ 26న రిలీజ్ చేస్తారు. ఈ చిత్రాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.