తమిళ హీరో సరసన తమన్నా!
- సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుశ్
- గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందే సినిమా
- ధనుశ్ తో తమన్నాకు ఇది మూడో చిత్రం
ఈ క్రమంలో తమిళం నుంచి వచ్చిన ఓ ఆఫర్ కు అమ్మడు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ధనుశ్ హీరోగా అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం పేరు 'నాన్ వారువేన్'. గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు చిత్ర బృందం తమన్నాను సంప్రదించింది. దాంతో ఈ చిన్నది ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
గతంలో ధనుశ్, తమన్నా జంటగా 'పడిక్కాదవన్', 'వేంగై' వంటి రెండు చిత్రాలలో నటించారు. మళ్లీ కొనేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ ఇప్పుడు 'నాన్ వారువేన్' సినిమాలో జంటగా నటిస్తున్నారు.