దాసోజు శ్రవణ్ ఇంట విషాదం... తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- దాసోజు శ్రవణ్ తండ్రి కృష్ణమాచారి కన్నుమూత
- కరోనా బారినపడి మృతిచెందిన వైనం
- ఎంతో బాధపడ్డానన్న పవన్
- శ్రవణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
- శ్రవణ్ తల్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
మిత్రుడు దాసోజు శ్రవణ్ తండ్రి దాసోజు కృష్ణమాచారి ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కష్ట సమయంలో శ్రవణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రవణ్ తల్లి జోగమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.