సినీ హాస్య నటుడు పృథ్వీకి రోడ్డు ప్రమాదం
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ప్రమాదం
- ఆయన వాహనాన్ని ఢీకొన్న మరో కారు
- ప్రమాదం నిన్న జరిగినట్టు తెలిపిన ఆయన టీమ్
ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదం నిన్న జరిగిందని పృథ్వీ టీమ్ ఆయన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈరోజు తెలియజేసింది. అయితే పృథ్వీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆగస్టులో పృథ్వీ కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే.