పూరీ జగన్నాథ్ గారూ, మీ పోడ్ కాస్ట్ చాలా బాగుంది: సోము వీర్రాజు
- సామాజిక అంశాలపై పోడ్ కాస్ట్ నిర్వహిస్తున్న పూరీ
- ఆకట్టుకుంటున్న పూరీ పోడ్ కాస్ట్ ఎపిసోడ్లు
- పూరీ ఆలోచన అభినందనీయం అంటూ సోము ట్వీట్
"పూరీ జగన్ గారూ, మీ తాజా పోడ్ కాస్ట్ విన్నాను. చాలా బాగుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం నిర్వహించాలన్న మీ ఆలోచన అభినందనీయం. ఇతరులకు ఆదర్శనీయం. ఇలాగే మీరు మరెన్నో అంశాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... హమారా భారత్ మహాన్" అంటూ ట్వీట్ చేశారు.