అంకిత ఉంటున్న ఫ్లాట్ కు ఈఎంఐలు చెల్లిస్తున్న సుశాంత్!
- సుశాంత్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు
- దర్యాప్తులో ఆసక్తికర అంశాలు!
- రూ.4.5 కోట్ల ఖరీదైన ఇంటిలో ఉంటున్న అంకిత లోఖండే
ముంబయిలోని మలాద్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లాట్ ఖరీదు రూ.4.5 కోట్లు కాగా, కొనుగోలు సమయంలో ఈ ఫ్లాట్ కోసం ఎంత చెల్లించిందీ తెలియరాలేదు. జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం కేవలం కొన్ని ఇన్ స్టాల్ మెంట్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయట.
కాగా, సుశాంత్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి కూడా ఈ ఫ్లాట్ గురించి ప్రస్తావించింది. తానే ఈఎంఐలు కడుతున్నా గానీ అంకితను ఆ ఫ్లాట్ ను ఖాళీ చేయాలని సుశాంత్ ఎప్పుడూ కోరలేదని రియా చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై మీడియా వర్గాలు అంకితను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు.