ఓ పెయింటింగ్ ను చూసి భయపడి మంత్రాలు చదివిన సుశాంత్ సింగ్... ఈడీ ఎదుట రియా చక్రవర్తి
- సుశాంత్ సింగ్ సున్నిత మనస్కుడు
- 'సాటర్న్ డెవోరింగ్ హిస్ ఓన్ సన్' చూసి భయపడ్డాడు
- ఓ హోటల్ లో చిత్రాన్ని చూసి భయపడ్డాడన్న రియా
ఈ ఘటన ఓ హోటల్ లో జరిగిందని రియా చక్రవర్తి అధికారులకు వివరించింది. ఆ సమయంలో తాను తన సోదరుడితో కలిసి మరో గదిలో ఉన్నానని తెలిపింది. సుశాంత్ గదికి తాను వెళ్లేసరికి భయంతో వణికిపోతూ మంత్రాలు జపిస్తూ కనిపించాడని తెలిపింది. కాగా, తన కడుపున పుట్టిన ఓ కొడుకు తనను సింహాసనం నుంచి దూరం చేస్తాడని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో, ఆ భయంతో, తనకు కొడుకులు పుట్టీపుట్టగానే వాళ్లను పీక్కుతినే సాటర్న్ రాజు చిత్రంగా 'సాటర్న్ డెవోరింగ్ హిస్ ఓన్ సన్' చిత్రరాజం నిలిచింది.