సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డబ్బింగ్ చెబుతానంటున్న రష్మిక
- విడుదలకు రెడీగా 'ఉప్పెన'
- విజయ్ సేతుపతి హీరోగా తెలుగు సినిమా
* మెగా ఫ్యామిలీకి చెందిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రం విడుదలకు రెడీ అయింది. ఫైనల్ ఎడిటింగ్ తర్వాత రన్ టైంను రెండు గంటల ముప్పై నిమిషాలుగా సెట్ చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థియేటర్లు తెరుచుకోగానే విడుదల చేస్తారు.
* 'ఉప్పెన' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు విజయ్ సేతుపతి త్వరలో ఓ తెలుగు చిత్రంలో హీరోగా నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.