విజయ్ దేవర కొండకు అండగా దర్శకుడు కొరటాల శివ, హీరో కార్తికేయ
- మిడిల్ క్లాస్ ఫౌండేషన్ కు కార్తికేయ లక్ష రూపాయల విరాళం
- ‘లవ్ యూ బ్రదర్..’ అంటూ కొరటాల ట్వీట్
- నీకు తోడుగా నేనుంటాను. కుమ్మేద్దామన్న కొరటాల
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, హీరో కార్తికేయ స్పందించారు. విజయ్ దేవర కొండ ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్) కు కార్తికేయ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. విజయ్ దేవర కొండకు తోడుగా ఉంటానని కొరటాల శివ ఓ ట్వీట్ ద్వారా తన మద్దతు ప్రకటించారు. ‘లవ్ యూ బ్రదర్, పది మందికి తోడుగా ఉండే పనుల్లో నీకు తోడుగా నేనుంటాను. కుమ్మేద్దాం. మంచితో. త్వరలో కలుద్దాం’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.