పవన్ తో క్రిష్ మూవీ .. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగేకథ!
- క్రిష్ దర్శకత్వంలో 'విరూపాక్ష'
- మొఘల్ చక్రవర్తుల కాలంలో సాగే కథ
- ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్
కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా జాక్విలిన్ ను తీసుకున్నారు. ఔరంగజేబు సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. పవన్ .. జాక్విలిన్ కి మధ్య ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.