పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన ప్రగ్యా జైస్వాల్?
- 'కంచె' సినిమాతో మంచి క్రేజ్
- చివరిసారిగా చేసిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'
- త్వరలోనే సెట్స్ పైకి
ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ పాయింట్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ 'దొంగ' పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ సరసన కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'కంచె' సినిమాతో ఆమె మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చివరిగా చేసిన చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర'.