'ఫైటర్'లో కీలకమైన పాత్రలో కార్తికేయ?
- పూరి దర్శకుడిగా రూపొందనున్న 'ఫైటర్'
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- కథానాయికగా తెరపైకి జాన్వీ కపూర్ పేరు
ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కీలకమైన పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అది ప్రత్యేకమైన పాత్రనా? లేదంటే విలన్ పాత్రనా? అనే విషయంపై స్పష్టత రావలసి వుంది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో కార్తికేయ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అందువలన 'ఫైటర్' సినిమాలోను ఆయన విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.