కన్యాకుమారి భగవతి ఆలయంలో వ్రతం ప్రారంభించిన నయనతార!
- కొత్త చిత్రంలో అమ్మవారి పాత్ర పోషిస్తున్న నయనతార
- షూటింగ్ ముగిసేంత వరకూ నయన్ దీక్ష
- ప్రియుడితో కలిసి ఆలయానికి వచ్చిన విఘ్నేశ్
సినిమా షూటింగ్ ముగిసేంత వరకూ నయనతార వ్రతం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆలయానికి వచ్చిన నయనతారను చూసేందుకు భక్తులు ఎగబడటంతో, సినిమా యూనిట్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను అదుపు చేశారు. ఆపై అక్కడి నుంచి వెళ్లిన నయనతార, విఘ్నేశ్ లు తిరుచెందూర్ చేరుకుని అక్కడి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.