రైతు సమస్యలపై బహిరంగ చర్చకు రండి: పవన్ కు ఏపీ మంత్రి మోపిదేవి సవాల్
- దేశమంతటా ఉల్లి సమస్య ఉంది
- చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం తప్ప ఆయనకు ఏం తెలుసు
- రైతు సమస్యలపై పవన్ కు అవగాహన లేదు
పవన్ గారికి కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే వచ్చని, అంతకు మించి అతనికి ప్రజలు, రైతుల సమస్యలు తెలియవని ఎద్దేవా చేశారు. దేశమంతటా ఉల్లి సమస్య ఉందని, కోట్ల రూపాయలు వెచ్చించి రైతు బజార్ల ద్వారా సబ్సిడీకే ఉల్లిని సరఫరా చేస్తున్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు రైతు సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న విషయం కూడా పవన్ తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు.