రవిబాబు వల్లనే నటుడిని అయ్యాను: దర్శకుడు కాశీ విశ్వనాథ్
- మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది
- దర్శకత్వ శాఖలో చాలాకాలం పనిచేశాను
- నటుడిగా ఇంతవరకూ 150 సినిమాలు చేశాను
అలా దర్శకత్వంపై దృష్టి పెట్టిన నన్ను నటుడిగా చేసింది రవిబాబు. నేను అన్నవరంలో ఉండగా కాల్ చేసి, 'నచ్చావులే' సినిమాలో నాకు వేషం ఇస్తున్నట్టుగా చెప్పాడు. నటుడిగా నా ప్రయాణం ఆ సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో నాకు మంచి పేరు వచ్చింది. ఇంతవరకూ 150 సినిమాల వరకూ చేశాను. నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చారు.