ఇకపై అలా చేయనంటున్న అనూ ఇమ్మాన్యుయేల్
- తొలి సినిమాతోనే దక్కిన హిట్
- ఒక్కసారిగా మెగా హీరోల సరసన ఛాన్స్
- కాలం కలిసి రాకపోవడంతో వెనకబడిన అనూ
అయితే దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి. అయితే అమ్మడు ఇప్పుడు రియలైజ్ అయిందట. కథల విషయంలో పెద్దగా దృష్టి పెట్టకుండా ఓకే చెప్పేస్తూ వెళ్లడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని సన్నిహితుల దగ్గర వాపోతోందట. మళ్లీ తెలుగు నుంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ, ఈ సారి కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, తానేమిటనేది నిరూపిస్తాననే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోందట.