బన్నీ 'ఐకాన్' ప్రాజెక్టు అటకెక్కిందట!
- బన్నీతో 'ఐకాన్' ప్లాన్ చేసిన వేణు శ్రీరామ్
- పూర్తి కథ పట్ల బన్నీ అసంతృప్తి
- సుకుమార్ సినిమాకి పూజా కార్యక్రమాలు
వేణు శ్రీరామ్ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ముందుగా లైన్ చెప్పినప్పుడు ఓకేనన్న అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ పూర్తి కథను చెప్పిన తరువాత అసంతృప్తిని వ్యక్తం చేశాడట. వేణు శ్రీరామ్ మెప్పించలేకపోయిన కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. ఇక సుకుమార్ తో సినిమా, మైత్రీ మూవీస్ కార్యాలయంలో రేపు పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.