'సైరా నరసింహా రెడ్డి' 18 రోజుల వసూళ్లు
- ఈ నెల 2న విడుదలైన 'సైరా'
- ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్
- 18 రోజుల్లో 140 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 229 కోట్ల గ్రాస్ ను .. 140 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ 18 రోజుల్లో ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 32 కోట్లకి పైగా వసూలు చేయడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కావడం, భారీ తారాగణం .. ఆసక్తిని రేకెత్తించే కథనం .. ఆకట్టుకునే చిత్రీకరణ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు లభించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.