నాకు పారితోషికం కంటే పాత్ర ముఖ్యం: సీనియర్ నటి సుధ
- ఒకప్పుడు మంచి పాత్రలు చేశాను
- ఇప్పటి పాత్రల్లో విషయం ఉండటం లేదు
- పాత్ర నచ్చితేనే చేస్తానన్న సుధ
కానీ ఇటీవల కాలంలో వస్తోన్న పాత్రల్లో ఎలాంటి విషయం ఉండటం లేదు. అందుకే సినిమాల సంఖ్యను తగ్గించేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో మనసు చంపుకుని చేస్తున్నాను. డబ్బుకోసమే అయితే ఈ పాటికి ఇంకా ఎక్కువ సినిమాలు చేసి ఉండేదానిని. ఒక నటిగా నా సంతృప్తి నాకు ముఖ్యం గనుక, నా మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నాను. చేసిన ప్రతి పాత్ర నన్ను ఒక మెట్టు పైనుంచాలనేదే నా తాపత్రయం" అని చెప్పుకొచ్చారు.