సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అనుపమ మల్టీ టాస్కింగ్!
- 'దొరసాని' హీరో తాజా చిత్రం
- కన్నడ రీమేక్ లో డా.రాజశేఖర్
* 'దొరసాని' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసుకున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తాడు.
* ఇటీవల 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాక్టర్ రాజశేఖర్ ఆశించిన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో తన తదుపరి చిత్రంగా ఓ కన్నడ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ చిత్ర నిర్మాత ధనుంజయ దీనిని నిర్మిస్తారు.