చాలా టెన్షన్ పడుతున్నా: రష్మిక
- చాలా బిజీగా, ఒత్తిడిగా అనిపిస్తోంది
- తీరిక లేకుండా పనిచేయడం ఓ వరం
- నేను కూడా అలాగే ఉండాలని ఆశించా
ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వరుస సినిమాలతో చాలా బిజీగా, ఒత్తిడిగా అనిపిస్తోందని తెలిపింది. ఒక్కోసారి తెల్లవారుజామున సెట్‌కు వెళ్తే తిరిగి పడుకునే సరికి తెల్లారిపోయేదని, మరుసటి రోజు మళ్లీ సెట్‌కి వెళ్లాల్సి వచ్చేదని, దీంతో తిండి, నిద్ర కూడా కరువయ్యేవని తెలిపింది. అయితే ఇలా తీరిక లేకుండా పని చేయడమన్నది ఓ వరమని, తాను కూడా అలాగే ఉండాలని ఆశించినట్టు రష్మిక తెలిపింది. అయితే సినిమాలో తన నటన ప్రేక్షకులకు నచ్చుతుందా? తన కష్టం ఫలిస్తుందా, లేదా? అని సినిమా విడుదలకు ముందు చాలా ఆందోళన పడుతున్నానని రష్మిక తెలిపింది.