సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తమన్నా సినిమా విడుదల వాయిదా
- స్నేహం కోసం రిస్క్ చేసే పాత్రలో నాని
- తాప్సీ త్రిభాషా చిత్రం రెడీ
* ప్రస్తుతం 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో నటిస్తున్న హీరో నాని దీని తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో మిత్రధర్మం కోసం ఏదైనా సరే చేయగలిగే కర్ణుడి తరహా పాత్రను పోషిస్తాడట.
* సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ నటించిన త్రిభాషా చిత్రం 'గేమ్ ఓవర్' సెన్సార్ పూర్తయింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.