కాజల్ 'కోమలి' సినిమా నుంచి కొత్త పోస్టర్
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'సీత'
- వచ్చేనెల 21న తమిళ సినిమా రిలీజ్
- జయం రవి జోడీ కట్టిన కాజల్
తమిళంలో జయం రవి - కాజల్ జంటగా 'కోమలి' సినిమా నిర్మితమైంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 7th లుక్ గా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకునేలా వుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో అక్కడ తన కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందనే ఆశతో కాజల్ వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.