మహేశ్ బాబును 'ఒరేయ్' అనడమే ఇబ్బందిగా అనిపించింది: 'అల్లరి' నరేశ్
- 'మహర్షి' రెస్పాన్స్ ఆనందాన్నిస్తోంది
- మహేశ్ కి స్నేహితుడిగా కనిపిస్తాను
- ఆయన మంచి మనసును దగ్గరగా చూశాను
ఈ సినిమాలో నేను మహేశ్ స్నేహితుడిగా కనిపిస్తాను. అందువలన ఆయన నన్ను ఒకటి .. రెండుసార్లు 'ఒరేయ్' అని పిలుస్తాడు. కానీ నేను మాత్రం ఆయనను 'ఒరేయ్' అని చాలాసార్లు పిలిచాను. అలా పిలవడం నాకు చాలా ఇబ్బందిని కలిగించింది. ఆ విషయాన్ని వంశీ పైడిపల్లితో చెప్పాను కూడా. స్నేహితులు అలాగే పిలుచుకుంటారనీ, మహేశ్ ఏమీ అనుకోరని ఆయన చెప్పాడు. ఈ సినిమాతో మహేశ్ మంచి మనసును దగ్గరగా చూడగలిగాను అని ఆయన చెప్పుకొచ్చాడు.