మెగా హీరో సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు
- హీరోగా రంగంలోకి వైష్ణవ్ తేజ్
- కీలమైన పాత్రలో విజయ్ సేతుపతి
- టైటిల్ గా 'ఉప్పెన' ఖరారు
సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయకుడు మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడిగా కనిపిస్తాడు. అందువలన ఈ సినిమాకి 'జాలరి' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాకి 'ఉప్పెన' అనే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారనే సంగతి తెలిసిందే.