'నీలాంబరి' పాత్రను చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: రమ్యకృష్ణ
- 'నీలాంబరి' పాత్ర చేయడం ఇష్టం లేదు
- ఆ పాత్ర అలా ప్రవర్తించడం నచ్చలేదు
- ఇంతటి పేరును తెస్తుందనుకోలేదు
నిజం చెప్పాలంటే ఆ పాత్రపట్ల నాకు ఆసక్తి వుండేది కాదు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రను చేయడానికి నేను చాలా భయపడ్డాను. ముఖ్యంగా 'నీలాంబరి' పాత్ర మనస్తత్వం నన్ను కూడా చాలా కలవరపాటుకు గురిచేసింది. సౌందర్య ముఖాన్ని కాలుతో తాకుతూ నాలోని పొగరుని చూపించే సీన్ చేయడానికి నేను చాలా ఇబ్బందిపడ్డాను. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయితే, 'నీలాంబరి' పాత్ర ఇంతటి పేరును తీసుకొస్తుందని అప్పట్లో నేను ఎంతమాత్రం ఊహించలేదు" అని చెప్పుకొచ్చారు.