'మహా' షూటింగులో గాయపడిన హన్సిక
- అందాల కథానాయికగా హన్సికకి క్రేజ్
- తమిళంలో బిజీ హీరోయిన్
- 50వ చిత్రంగా రానున్న 'మహా'
ఆమె 50వ చిత్రంగా 'మహా' రూపొందుతోంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా, హన్సిక జారిపడిపోవడంతో ఆమె చేతికి గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.