కర్ణాటకలో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. స్పందించిన హీరోలు యశ్, సుదీప్!
- నిన్న జరిగిన ఐటీ దాడులు
- 23 చోట్ల అధికారుల తనిఖీలు
- ఆదాయానికి, రిటర్నులకు వ్యత్యాసం ఉండటంతోనే
ఈ విషయమై యశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నాకేం భయం లేదు. ఐటీ దాడులకు భయపడను. నేనే తప్పూ చేయలేదు. ఐటీ అధికారులను వారి పనిని చేసుకోనివ్వాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలకు రావొద్దు’ అని తెలిపాడు. మరోవైపు సుదీప్ మాట్లాడుతూ.. ‘ఐటీ దాడుల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ దాడులకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని వెల్లడించాడు. కాగా, ఈ దాడుల్లో అధికారులు విలువైన పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.